లాక్‌డౌన్‌: నటాషాకు హిందీ నేర్పిస్తూ..

భారత క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తన కాబోయే భార్య నటాషా స్టాన్‌వికోవిచ్‌తో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతూ.. సందడి చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఈ జంట తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా నటాషాకు హిందీ నేర్పిస్తున్న హార్ధిక్‌ పాండ్యా ఓ సరదా వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘బేబీ.. నేను నీకు ఏమౌతాను’ అని అడగ్గా దానికి నటషా వచ్చిరాని హిందీలో సమాధానం ఇచ్చింది. ఇక నటాషా సమాధానంతో హార్ధిక్‌ సిగ్గుపడుతున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (‘ఆసక్తికర చర్చ మొదలెట్టి.. ముగించేశాడు’)